ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

By

Published : Jan 12, 2021, 8:08 AM IST

సెంటు భూమి లేకపోయినా వ్యవసాయంపై మక్కువతో పొలం కౌలుకు తీసుకున్నాడు. పెట్టుబడికి అప్పు తీసుకొచ్చాడు. ఆశించిన పంట దిగుబడి రాక.. అప్పు తీర్చే మార్గం లేక.. బలవంతంగా తనువు చాలించాడు. కుటుంబంలో విషాదం నింపిన ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

farmer suicide
అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరుకి చెందిన ఆరమళ్ల రవి (39)... గత ఏడాది 8 ఎకరాల్లో పొగాకు, వరి సాగు చేశాడు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాడు. ఆశించిన దిగుబడులు రాలేదు. ఈ ఏడాది కూడా పంటలో నష్టం వచ్చింది.

ఇప్పటికే 5 లక్షల రూపాయల అప్పులు ఉండటంతో మనో ధైర్యం కోల్పోయిన రవి... పొలం వద్ద పురుగుల మందు తాగాడు. పక్క పొలంలో రైతులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. భార్య, ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details