అన్యాయం చేయకండి.. విధుల్లోకి తీసుకోండి!
గతంలో కంప్యూటర్ టీచర్లుగా పనిచేసిన సిబ్బంది.. మరోసారి తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని సీఎం ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు.
protest
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ ఇంటి ఎదుట.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతంలో కంప్యూటర్ ఉపాధ్యాయులుగా పనిచేసిన సిబ్బంది.. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం నివాస సమీపంలోని భరతమాత విగ్రహం వద్ద నినాదాలు చేశారు. నిషేధిత ప్రాంతంలో ఆందోళనకు దిగారంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని అక్కడినుంచి తరలించారు.