రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై నిరాశకు గురైన నిరుద్యోగులు తమ నిరసనను ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా గుంటూరులో యువజన, విద్యార్థి సంఘాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సాధన సమితిగా ఏర్పడ్డాయి. ప్రభుత్వం వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను చూపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఛలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చాయి.
ఉద్యోగ సాధన సమితి ఉద్యమ కార్యాచరణకు ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణరావు మద్ధతు ప్రకటించారు. అన్ని శాఖల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉండగా.. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో చూపించిన ఖాళీలను చూసి నిరుద్యోగులు నిరాశకు గురయ్యారని.. ఎమ్మెల్సీ లక్ష్మణరావు వ్యాఖ్యానించారు. వేల సంఖ్యలో ఖాళీలను చూపుతూ మళ్లీ ప్రభుత్వం అనుబంధ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని.. ఈ నెల 30న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు.