విధి నిర్వహణలో కరోనా కాటుకు గురై ఎంతోమంది జర్నలిస్టులు ప్రాణాలు వదిలారు. అయినా కూడా ప్రాణాలకు భయపడకుండా ప్రజల సమస్యలను తెెలుసుకుంటున్నారు. కొవిడ్ బాధితులకు తమ వంతు సహాయంగా గుంటూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా తెనాలిలోని జిల్లా కొవిడ్ ప్రభుత్వాసుపత్రిలోని బాధితులకు పాలు, గుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, ఏపీయుడబ్ల్యూజే, రాష్ట్ర కార్యదర్శి చందు జనార్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి తమ వృత్తిని నిర్వర్తిస్తున్న ప్రతి విలేఖరికి అభినందనలు అని ఎమ్మెల్యే కొనియాడారు. మరోవైపు మానవత్వాన్ని చాటుతూ.. కోవిడ్ బాధితులకు తమ వంతు సాయం చేయడం గర్వనీయమన్నారు.
ఓ వైపు విధుల నిర్వహణ..మరోవైపు సేవలు
కరోనా వేళ జర్నలిస్టుల సేవలు మరువలేనివి. కోవిడ్ వస్తుందని తెలిసినా.. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తూ..సలహాలు, సూచనలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో..ప్రభుత్వాసుపత్రిలోని బాధితులకు పాలు, గుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు.
తెనాలిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉదారత
ఇదీ చూడండి.
రోగుల సహాయకుల ఆకలి తీరుస్తున్న రెడ్ క్రాస్ సంస్థ