ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. వరినాట్లు పెరగడమే కారణమా? - నెేటి తెలుగు వార్తలు

Cultivated area increased with electricity supply in telangana: రాష్ట్ర విభజన జరిగిన తరవాత విద్యుత్​ కొరకు తెలంగాణ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అటువంటిది నేడు తెలంగాణలో విద్యుత్​ వినియోగం భారీగా పెరిగింది. అందుకు తగ్గట్లుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి.. నిరంతరం విద్యుత్​ను పంపిణీ చేస్తున్నారు. ఈ పరిస్థితి కారణం వరినాట్లు, సాగునీటి ప్రాజెక్టులకు నిరంతరం సరఫరా చేయడమేనని తెలుస్తోంది.

electricity supply in telangana
విద్యుత్ వినియోగం

By

Published : Dec 27, 2022, 4:20 PM IST

Cultivated area increased with electricity supply in telangana: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ నెలలో 13403 మెగావాట్ల గరిష్ఠానికి వినియోగం చేరింది. సాధారణంగా ఫిబ్రవరిలో కరెంట్‌ డిమాండ్‌ అధికంగా ఉండేది అయితే ముందస్తు వరినాట్లు, సాగునీటి ప్రాజెక్టులకు నిరంతర సరఫరాతో.. ఈసారి డిసెంబర్​లోనే గరిష్ఠానికి చేరిందని అధికారులు అంటున్నారు. వచ్చే వేసవిలో 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని అధికారులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details