ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏకగ్రీవాలపై ఎన్నికల పరిశీలకుల ఆరా

గుంటూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలకు కారణాలు తెలుసుకునేందుకు ఎన్నికల పరిశీలకులు రంగంలోకి దిగారు. కాకుమాను గ్రామంలో పర్యటించిన అధికారులు.. అభ్యర్థులతో మాట్లాడారు. దీనిపై పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి నివేధిక పంపుతామన్నారు.

election observers  find out the reasons for the  unanimous in guntur district
ఏకగ్రీవాలకు కారణాలు తెలుసుకునేందుకు ఎన్నికల పరిశీలకులు

By

Published : Feb 5, 2021, 8:39 PM IST

గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలకు కారణాలు తెలుసుకునేందుకు ఎన్నికల పరిశీలకులు కాకుమాను మండలంలో పర్యటించారు. కాకుమాను గ్రామపంచాయతీ ఏకగ్రీవం కావటంతో ఎన్నికల అధికారులతో పాటు.. అభ్యర్థులతోనూ మాట్లాడారు. నామినేషన్లు ఎందుకు వెనక్కు తీసుకున్నారని ప్రశ్నించారు. వారిచ్చిన సమాధానాల్ని నోట్ చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనేది ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఎన్నికల పరిశీలకులు రామచంద్రరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details