Ed Inquiry On Liger Movie Investment: లైగర్ సినిమా పెట్టుబడులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సినిమా నిర్మాణ సమయంలో రూ.10 కోట్లు విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిందని ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, విజయ్ దేవరకొండను విచారించింది. పూరి కనెక్ట్స్ ఎల్‌ఎల్‌ఎల్‌పీకి సంబంధించిన రూ.30-40 కోట్ల ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం.
లైగర్ సినిమా పెట్టుబడులపై.. ఈడీ దర్యాప్తు ముమ్మరం - నేటి తెలుగు వార్తలు
Ed Inquiry On Liger Movie Investment: లైగర్ సినిమా పెట్టుబడులపై ఈడీ దూకుడు పెంచింది. సినిమా నిర్మాణ సమయంలో రూ.10 కోట్లు విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిందని ఈడీ గుర్తించినట్లు సమాచారం. అలాగే లైగర్ సినిమా పెట్టుబడులకు రాజకీయ నేతలతో సంబంధముందా అని కూపీ లాగుతోంది.
ఈడీ దర్యాప్తు
పలు ఖాతాల్లో నుంచి ఈ డబ్బు బదిలీ అయినట్లు గుర్తించిన క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ గతంలో నటించిన సినిమాలకు తీసుకున్న పారితోషికం.. లైగర్ సినిమాకు తీసుకున్న మొత్తం గురించి ఆరా తీస్తోంది. లైగర్ సినిమాకు తక్కువగా తీసుకున్నట్లు గుర్తించినట్లు సమాచారం. అందులో మతలబు గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే లైగర్ సినిమా పెట్టుబడులకు రాజకీయ నేతలతో సంబంధముందా అని కూపీ లాగుతోంది.
ఇవీ చదవండి: