గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఎంపీపీ ఎన్నికకు కోరం లేకపోవడం వల్లే రేపటికి వాయిదా వేశామని ఎన్నికల అధికారి రాంప్రసన్న తెలిపారు. 18 మంది ఎంపీటీసీలకుగాను వైకాపాకు చెందిన 8 మంది సభ్యులు మాత్రమే హాజరైనట్లు తెలిపారు. దుగ్గిరాల మండలంలో తెదేపాకు 9, వైకాపా 8, జనసేన ఒక ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నారు. కానీ సమావేశానికి తెదేపా ఎంపీటీసీలు హాజరుకిలేదు. మధ్యాహ్నం ఒంటిగంటకు కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక ఉండగా... వైకాపా నుంచి సుభాని ఒక్కరే నామినేషన్ వేశారు. ఎంతసేపటికీ 50 శాతం మంది సభ్యులు హాజరుకాకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు.
DUGGIRALA MPP ELECTIONS: దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రేపు మధ్యాహ్నానికి వాయిదా - ap latest news
పోలీసుల భారీ బందోబస్తు మధ్య దుగ్గిరాల ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ప్రారంభమైంది. వైకాపా నుంచి 8 మంది ఎంపీటీసులు హజరుకాగా.. తెదేపా నుంచి ఏ ఒక్క ఎంపీటీసీ కూడా రాలేరు. జనసేన అభ్యర్థి కూడా హాజరుకానందున.. ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రేపు మధ్యాహ్నానికి వాయిదా
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక సందర్భంగా నందివెలుగు - మంగళగిరి మార్గంలో వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. దుగ్గిరాలకు 3 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎంపీడీవో కార్యాలయంలోకి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మీడియాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:iyr krishna rao: 'ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీస్కుంటున్నరు..!'
Last Updated : Sep 24, 2021, 3:38 PM IST