మురుగుకాల్వ విషయంలో వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. మురుగునీరు తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లనీయకుండా దిగువ ప్రాంతాల వారు అడ్డుకున్నారు. దీనిపై అవతలి వారు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల వారు కర్రలతో దాడులు చేసుకోవటంతో.. 10మందికి గాయాలయ్యాయి. వారందరినీ సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మురుగు కాల్వ వివాదం...ఇరువర్గాల ఘర్షణ..10మందికి తీవ్ర గాయాలు - drinage canal issue in guntur latest
మురుగుకాల్వ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. మురుగునీరు తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లనీయకుండా దిగువ ప్రాంతాల వారు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మురుగుకాల్వ వివాదం.
గతంలోనూ ఈ రెండు వర్గాల వారికి వేర్వేరు విషయాల్లో పాతకక్షలు ఉన్నట్లు సమాచారం. దీంతో చిన్న విషయానికే గొడవకు దిగి పరస్పర దాడుల వరకు వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ...19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం