రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో కొవిడ్ రెండో దశ వ్యాక్సిన్ ను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? లేదా? అని పరిశీలించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి డాక్టర్ నీరదని.. స్టేట్ కన్సల్టెన్సీగా నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని పలు వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం అక్కడి దస్త్రాలను తనిఖీ చేశారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నెల 31 వరకు రెండొ దశ వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే రెండో దశ వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. తాము పరిశీలించిన అన్ని ప్రదేశాల్లో ప్రశాంత వాతావరణంలో వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఆమె వివరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు టీకాను వేయించుకున్నట్లు నీరద వివరించారు.