రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ 337వ రోజు ఆందోళనలు జరిగాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఐనవోలు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, ఉద్ధండరాయునిపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, అనంతవరం గ్రామాల్లో దీక్షలు కొనసాగించారు.
నాగుల చవితిని పురస్కరించుకొని ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెంలో రైతులు, మహిళలు నాగదేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పొంగళ్లు సమర్పించారు. నాగమ్మ తమకు అండగా నిలవాలని, రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం మారాలని పూజలు చేసినట్లు మహిళలు చెప్పారు.