క్షేత్ర స్థాయిలో పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. జిల్లా ఎస్పీలకు నూతన ట్యాబ్లను అందజేశారు. ఈ ట్యాబ్లో ప్రస్తుతం వినియోగించే.. పోలీస్ యాప్లతో పాటు అదనంగా మరికొన్ని వివరాలను పొందిపరిచినట్లు అధికారులు వెల్లడించారు. సీసీటీఎన్ఎస్, ఐసీజెఎస్, ఎల్హెచ్ఎంఎస్, పీఐఎన్ఎస్, ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ వివరాలను ట్యాబ్లో నిక్షిప్తం చేసినట్లు వివరించారు. జిల్లాల నుంచి కేసుకు సంబంధించిన వివరాలను.. అధికారులు ఆన్లైన్లో తెలుసుకోవచ్చునని డీజీపీ తెలిపారు. తొలివిడతగా 10 మందికి ఇవ్వగా.. మిగిలిన వారికి త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. నేరస్తులకు సంబంధించిన డేాటుకు ట్యాబ్ అనుసంధానం చేసి ఉంటుందని తెలిపారు.
సాంకేతికతను వినియోగించుకోవాలి: డీజీపీ గౌతమ్ సవాంగ్ - డీజీపీ గౌతమ్ సవాంగ్ న్యూస్
జిల్లా ఎస్పీలకు నూతన ట్యాబ్లను డీజీపీ అందజేశారు. మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్