ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 3, 2020, 2:22 PM IST

ETV Bharat / state

ఏడాదిలో పోలీసు సేవలను ప్రజలకు దగ్గర చేశాం: డీజీపీ

సంవత్సర కాలంలో పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. స్పందన కార్యక్రమం, దిశ చట్టం, సాంకేతికత వినియోగంతో పోలీసు సేవలను ప్రజలకు దగ్గర చేసినట్టు వెల్లడించారు.

dgp
dgp

పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఒకప్పుడు పోలీసు స్టేషన్ కి వెళ్లాలంటేనే భయపడిన సామాన్యులు..ఇప్పుడు ధైర్యంగా సమస్యలు చెప్పుకోగలుగుతున్నారని వివరించారు. పోలీసుల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసి..సేవా దృక్పథంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

స్పందన ద్వారా 75,610 పిటిషన్లు అందాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. దీని ద్వారా 16,403 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. 403 ఎఫ్‌ఐఆర్‌లు పెండింగ్ లో ఉన్నాయన్న డీజీపీ ..'దిశ' ద్వారా మొత్తం 4 లక్షల పిటిషన్లు అందాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 274 జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 88 శాతం కేసుల దర్యాప్తు పూర్తిచేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా మొదటిసారిగా హోం క్వారంటైన్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చామని డీజీపీ వివరించారు.

ఇదీ చదవండి:విశాఖ వైద్యుడు సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details