పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి దేవినేని తెలిపారు.సుమారు500మంది ఇంజినీర్లు డ్యామ్ సైట్‌లో పనిచేస్తున్నారన్నారు.కొన్ని వందలమంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారని..నిపుణులు,ఇంజినీర్ల సమక్షంలో పనులు సాగుతున్నాయని వివరించారు.ఎగువ,దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాలు వేగవంతం చేయాలని సీఎం సూచించారని పేర్కొన్నారు.
జగన్ కనుసన్నల్లో ఉండవల్లి, కేవీపీ: మంత్రి దేవినేని - tdp
పోలవరం పనులు వేగవంతం చేయడానికే సీఎం క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. 70 శాతానికి పైగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని అన్నారు. భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ కేసులు వేస్తున్నారని... ఆయనిచ్చే కాసుల కోసం జగన్ నోరు విప్పబోరని మంత్రి దేవినేని ఆరోపించారు. జగన్ కనుసన్నల్లో ఉండవల్లి, కేవీపీ నాటకాలాడుతున్నారని దేవినేని దుయ్యబట్టారు.
భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ కేసులు వేస్తున్నారని... ఆయన ఇచ్చేకాసుల కోసం జగన్ నోరు విప్పబోరని మంత్రి దేవినేని ఆరోపించారు.వైఎస్ హయాంలో లబ్ధిపొందిన వారంతా అక్కడ తెరాసలో,ఇక్కడ వైకాపాలో చేరారన్నారు.ప్రమాణస్వీకారం చేయాలంటే7ముంపు మండలాలు కలపాలని సీఎం పట్టుబట్టారన్న దేవినేని...ఆలయాలు మునిగిపోతాయని చెబుతున్న కేసీఆర్ ఆనాడు ఏంచేశారని ప్రశ్నించారు.పోలవరానికి నిధులు సమకూరకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్,కవిత పోలవరానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసినప్పుడు కేవీపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.రాజమహేంద్రవరం కొట్టుకుపోతుందని కొంతమంది అసత్యాలు చెబుతున్నారని...వైకాపాపై ప్రేమ ఉంటే ఆ పార్టీలో చేరండిగానీ...ప్రజలను పక్కదారి పట్టించొద్దని సూచించారు.జగన్‌కు లబ్ధి చేకూర్చడానికి కేవీపీ శతవిధాలా ప్రయత్నించారన్నారు.
పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రయత్నించారని...ఆ దుర్బుద్ధి కారణంగా పోలవరం పనులు రెండేళ్లకుపైగా ఆగిపోయాయని మండిపడ్డారు.జగన్ కనుసన్నల్లో ఉండవల్లి,కేవీపీ నాటకాలాడుతున్నారని దేవినేని దుయ్యబట్టారు.