గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచటం, పాజిటివ్ కేసులను గుర్తించటం వేగవంతం చేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కరోనా సోకిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలన్నారు. జిల్లాలో కరోనా కేసులు 4వేలకుపైగా దాటిన నేపథ్యంలో వైరస్ నివారణ చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కరోనా కేసులను గుర్తించటం వేగవంతం చేయాలి..కలెక్టర్
కరోనా కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచటం, పాజిటివ్ కేసులను గుర్తించటం వేగవంతం చేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు.
కరోనా కేసులన గుర్తించటం వేగవంతం చేయాలి..కలెక్టర్
కంటైన్మెంట్ జోన్లుగా అమలు చేయకపోతే వైరస్ వ్యాప్తి చెంది కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల రాకపోకలు లేకుండా పోలీసులతో పర్యవేక్షించాలన్నారు. వ్యాపార సంస్థలు మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాజిటివ్ వ్యక్తులను ఆసుపత్రిలోనే స్క్రీనింగ్ చేసి లక్షణాలను బట్టి కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించాలని సూచించారు.