ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''చంద్రబాబు స్పందించకుంటే.. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది'' - ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా

కరకట్ట వద్ద ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం తన ఇంటిని ఖాళీ చేయటం లేదని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శించారు. ఎన్ని నోటీసులిచ్చినా స్పందించకపోతే ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు వేరే ఇళ్లు దొరకదా?: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా

By

Published : Sep 25, 2019, 10:21 PM IST

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా

కరకట్ట వెంట ఉన్న అక్రమ కట్టడాలు చట్టబద్ధంగా కూల్చివేస్తుంటే ఇంకా తెదేపా అధినేత చంద్రబాబు తన ఇంటిని ఖాళీ చేయకపోవటం దారుణమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శించారు. చంద్రబాబుకు వేరే ఇల్లు దొరకదా అని ప్రశ్నించారు. అనుమతి లేకుండా నిర్మించినందునే ప్రజావేదికను తమ ప్రభుత్వం కూల్చివేసిందని గుంటూరులో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు. అక్రమ కట్టడాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు సరిగ్గా లేదన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని ఎన్ని సార్లు నోటీసులు పంపినా స్పందించకపోతే ప్రభుత్వం తన పని తను చేసకుపోతుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details