ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో అక్రమ కట్టడం.. కూల్చివేసిన అధికారులు

గుంటురులో అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బృందావన్​ గార్డెన్​లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్​ స్థలంలో నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు.

గుంటూరులో అక్రమ కట్టడాల కూల్చివేత
గుంటూరులో అక్రమ కట్టడాల కూల్చివేత

By

Published : Sep 3, 2021, 3:17 PM IST

గుంటూరులో అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని బృందావన్ గార్డెన్స్​లో కొత్తగా నిర్మించిన కట్టడాన్ని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కూల్చివేశారు.

వాణిజ్య సముదాయం కోసం అనుమతి తీసుకున్న యజమాని ఇటీవలే బృందావన్​ గార్డెన్​లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. భవనం వెనకవైపు ఉన్న స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయిస్తున్నట్లు ప్లాన్​లో పేర్కొన్నారు. అయితే ఆ ప్రాంతాన్ని ఖాళీగా వదలకుండా మూడంతస్థుల్లో మరో భవనం నిర్మించారు. దీనికి సంబంధించి వారం రోజుల క్రితం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఒక రోజు ముందు కూల్చివేత నోటీసులూ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. భవన యజమాని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ భవనానికి సంబంధించి ప్రహారి గోడ కూడా ముందుకు రావడంతో దాన్ని కూడా తొలగించారు.

ఇదీ చదవండి:గాడిదల సంచారంపై గ్రామస్థుల వినూత్న నిరసన

ABOUT THE AUTHOR

...view details