Dalita Girijana JAC leaders in AP: దళిత, గిరిజన జేఏసీ నాయకులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. దళిత గిరిజనులకు చెందని 27 సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలిపిదల చేసిందని గవర్నర్‌కు ఫిర్యాదుచేశారు. ఎస్సీ,ఎస్టీల సంక్షేమ అభివృద్ది రక్షణ చట్టాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఛైర్మన్ గోపాలరావు విమర్శించారు. రాజ్యాంగబద్దంగా ఉన్న ప్రత్యేక హక్కులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దళిత, గిరిజనుల హక్కులు అమలుపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని తెలిపారు. గతంలో అమల్లో ఉన్న అన్ని పథకాల వివరాలు గవర్నర్ కు అందించామని, దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
రద్గు చేసిన 27 పథకాలపై గవర్నర్‌ను కలిసిన దళిత, గిరిజన జేఏసీ నాయకులు... - Girijana JAC leaders
Dalita Girijana JAC: దళిత, గిరిజన జేఏసీ నాయకులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. దళిత గిరిజనులకు చెందని 27 సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలిపిదల చేసిందని గవర్నర్‌కు ఫిర్యాదుచేశారు. ఎస్సీ,ఎస్టీల సంక్షేమ అభివృద్ది రక్షణ చట్టాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఛైర్మన్ గోపాలరావు విమర్శించారు. రాజ్యాంగబద్దంగా ఉన్న ప్రత్యేక హక్కులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.
దళిత గిరిజన జేఏసీ
'ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ యాక్ట్‌ను గత ఐదారు సంవత్సరాలుగా నిర్వీర్యం చేశాయి. 2023తో సబ్‌ప్లాన్ యాక్ట్ ముగుస్తున్నందువల్ల దానిని కోనసాగించే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావలిని విన్నవించాం. ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికే ఖర్చు పెట్టాలని గవర్ను కోరడం జరిగింది.'- గోపాలరావు
ఇవీ చదవండి: