Dalit Amaravati JAC Leaders Protest : రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములు కలిగిన రైతులకు కౌలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట దళిత జేఏసీ నాయుకులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం కంటే మెరుగైన ప్యాకేజీ రాజధాని ప్రాంత అసైన్డ్ రైతులకు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. నేడు నట్టేట ముంచారని దళిత జేఏసీ నేత మార్టిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని ప్రాంతంలో దళిత జేఏసీ ఆందోళన.. అసైన్డ్ రైతుల కౌలు డబ్బులు చెల్లించాలని డిమాండ్
Dalit Amaravati JAC Leaders Protest: రాజధాని ప్రాంత అసైన్డ్ రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్.. నేడు దానిని తుంగలో తొక్కారని అమరావతి దళిత జేఏసీ నాయుకులు విమర్శించారు.
Dalit JAC Leaders Protest
మూడేళ్లుగా అసైన్డ్ రైతులకు కౌలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధికారులు సమావేశాల పేరుతో తుళ్లూరు, విజయవాడకు రమ్మని కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణమే కౌలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: