గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో.. వరద తాకిడికి పంటలు మునిగిపోయాయి. ప్రధానంగా వాణిజ్య పంటలైన పసుపు, మిర్చితోపాటు కూరగాయల పంటలైన దొండ, చిక్కుడు లాంటి వాటిని ఎక్కువ పెట్టిబడి పెట్టడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ పంటలు ఇంకా నీటిలోనే ఉండటంతో మొత్తం పంట కుళ్ళిపోయింది. ప్రభుత్వ వైఫల్యం వలనే ఇంత వరదొచ్చిందని...ఇప్పటికైనా తక్షణమే పంటల మీద సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని లంక గ్రామాల్లో పర్యటించిన కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి కుమార స్వామి అన్నారు. మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ లంక గ్రామాల్లో పర్యటించి వరద రావడం ఒక విపత్కర పరిస్థితని..తక్షణమే అన్నదాతను ఆదుకుంటామని... నష్టపోయిన వారికి అన్యాయం జరగకుండా చూసుకుంటామని తెలిపారు.
వరద తగ్గుతోంది... పంట నీటిలోనే కుళ్లుతోంది! - lanka villages
వరద తగ్గుముఖం పడుతోంది. కానీ... బాధితుల వ్యథ మాత్రం వర్ణనాతీతంగానే ఉంది. పంటంతా.. నీటిలోనే మునిగి ఉండడంతో అన్నదాతల్లో ఆందోళన కలుగుతోంది.
వరద తగ్గుతోంది... పంట నీటిలోనే కుళ్లుతోంది!