కృష్ణానది వరద ఉద్ధృతికి వేల ఎకరాలలో పొలాలు, వాణిజ్య పంటలు నీట మునిగాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో తాడేపల్లి మండలం చిర్రావూరులో మిరప, కంద, అరటి, పసుపు పంటల్లోకి వరద నీరు చేరింది. దుగ్గిరాల మండలం పెదకొండూరు, వీర్లపాలెం, గొడవర్రులో అరటి, పసుపు పంటలకు భారీ నష్టం వాటిల్లింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పడవలపై సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు. ఈ రాత్రికి వరద నీరు మరింత పెరిగే సమాచారం ఉండటంతో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వరద ఉద్ధృతితో పంటలు నీటిపాలు - వాణిజ్య పంటలు
కృష్ణా వరద ఉద్ధృతికి గుంటూరు జిల్లాలో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
వరద ఉద్ధృతి