ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీస్ సైరన్ వాడితే...క్రిమినల్ కేసులే' - ట్రాఫిక్ డీఎస్పీ కె.సుప్రజ

పోలీస్ సైరన్ వాడుతున్న ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ డీఎస్పీ కె.సుప్రజ తెలిపారు.

పోలీస్ సైరన్ వాడొద్దని...క్రిమినల్ కేసులుంటాయని వెల్లడిస్తున్న ట్రాఫిక్ డీఎస్పీ కె.సుప్రజ

By

Published : Aug 25, 2019, 8:40 PM IST

గుంటూరు నగరంలో బైక్​, ఇతర వాహనాలకు పోలీస్ సైరన్​లు బిగించుకొని రద్దీ ప్రదేశాలలో వాటిని మోగిస్తూ... కొంతమంది ఆకతాయిలు ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తున్నారు. స్థానిక ప్రజలు ఈ కుర్రకారుల ఫోటోలు, వీడియోలను తీసి వాట్సాప్ ద్వారా ట్రాఫిక్ డీఎస్పీకి పంపారు. అప్రమత్తమైన అధికారులు 5 వాహనాలను సీజ్ చేసి, వాహనదారులపై క్రిమినల్ కేసులు బనాయించారు. ఈ వాహనాలకు పోలీస్ సైరన్​లు బిగించిన షాప్ ఓనర్లకు నోటీస్​లు ఇచ్చి కేసులలో ముద్దాయిలుగా చేర్చారు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు పోలీస్, అంబులెన్స్ సైరన్ బిగించుకొని వాటిని మోగిస్తూ నడపవద్దని ట్రాఫిక్ డీఎస్పీ కె.సుప్రజ పేర్కొన్నారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ట్రాఫిక్ సమస్యలను ఫోటో లేదా వీడియో తీసి తమ ఫోన్ నెంబర్​కి సమాచారం ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details