తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సేవ్ ఇండియా- సేవ్ కాన్సిటిట్యూషన్' కార్యక్రమంలో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఓయూలోని అన్ని విద్యార్థి సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ పౌర చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టం ద్వారా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 20 లక్షలకు పైగా పౌరసత్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం భారత రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమని పేర్కొన్నారు. లౌకిక దేశాన్ని హిందూదేశంగా మార్చాలని భాజపా ప్రయత్నిస్తోందని అరోపించారు. వెంటనే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఏఏ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం : సీతారాం ఏచూరి - cpm on caa
ముస్లిం మైనారిటీలు, సంచార జాతులు, ఆదివాసీలు తమ పౌరసత్వం నిరూపించుకునేందుకు ఎలాంటి ఆధారాలు చూపించాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఓయూలో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన సమావేశంలో విద్యార్థి సంఘాలతో ఆయన సమావేశమయ్యారు.
సీఏఏ చట్టాన్ని వ్యతిరేకించిన సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి