ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంధన ధరలు తగ్గించాలని సీపీఐ డిమాండ్ - cpi demands for reduce the hiked fuel price

కరోనా కాలంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది. చరిత్రలో తొలిసారిగా డీజిల్ ధర పెట్రోల్​ను మించిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

cpi demands for reduce the hiked fuel price
ఇంధన ధరలు తగ్గించాలని సిపిఐ డిమాండ్

By

Published : Jun 28, 2020, 7:01 AM IST

కరోనా కాలంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో ప్రజలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే... కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరల పెంచి వారిపై మరింత భారం మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వరుసగా 20 రోజులకుపైగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి మోదీ ప్రభుత్వం రికార్డు సాధించిందన్నారు. చరిత్రలో తొలిసారిగా డీజిల్ ధర పెట్రోల్​ని మించిపోయిందని విమర్శించారు. ఇది చాలా రంగాలపై ప్రభావం చూపనుందని అభిప్రాయపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే పెట్రో ధరల పెరుగుదలకు కారణమన్నారు. ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ... ఈనెల 30వ తేదిన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:'అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details