ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో మరో 86 కరోనా కేసులు.. ఒకరు మృతి - today corona cases in guntur update

గుంటూరు జిల్లాలో తాజాగా 86 మందికి కరోనా సోకింది. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు.

covid cases in guntur district
తగ్గుతున్న కరోనా కేసులు

By

Published : Dec 3, 2020, 7:16 AM IST

గుంటూరు జిల్లాలో క్రమంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో కొత్తగా 86 కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73 వేల 55కి చేరింది. తాజా బులెటిన్ ప్రకారం అత్యధికంగా గుంటూరు నుంచి 25 కేసులు నమోదయ్యాయి. రేపల్లెలో 8 కేసులు, నరసరావుపేటలో 6, కారంపూడిలో 4 కేసులు చొప్పున రికార్డ్ అయ్యాయి.

వైరస్ నుంచి 71 వేల 337 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ కొవిడ్ కారణంగా ఒకరు మృతి చెందగా.. ఇప్పటివరకు మొత్తం 651 మంది ప్రాణాలు విడిచారు. కరోనాతో మృతి చెందినవారి సంఖ్యలో.. రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

ABOUT THE AUTHOR

...view details