కరోనా వ్యాప్తిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా.. గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే వంద పడకలను సిద్ధం చేసింది. కరోనా వ్యాధిగ్రస్తులు, లక్షణాలున్న వారికి చికిత్స అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే ముస్తాఫా, సూపరింటెండెంట్ డాక్టర్ బాబు లాల్ తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పడకలు సరిపోకుంటే సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. ఐసోలేషన్ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తమన్నారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులు - Corono New Wards in guntur district
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాబు లాల్ పరిశీలించారు.
'గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులు'