గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడొకరు ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రి భవనం మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రులో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడు మారుతీనగర్‌కు చెందిన వంగా నాగమురళి (66)గా గుర్తించారు. ఈ ఘటన తోటి రోగుల్లో భయాందోళన నింపింది. కొవిడ్ వైరస్ చేసే నష్టం కంటే భయంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మనోధైర్యమే అసలు మందన్న విషయాన్ని వైద్యులతోపాటు ఆప్తులు, బంధువులు, స్నేహితుల నుంచి బాధితులకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.
కొవిడ్ ఆస్పత్రి పైనుంచి దూకిన రోగి మృతి - మంగళగిరి ఎన్నారై కొవిడ్ ఆస్పత్రిలో కోరోనా బాధితుడు ఆత్మహత్యయత్నం వార్తలు
మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఆత్మహత్యకు యత్నించిన వృద్ధుడు మృతి చెందాడు. మృతుడు ఆందోళనకు గురై ఆసుపత్రి భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. తీవ్రగాయాలు కావటంతో చికిత్స అందిస్తుండగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతుడు గుంటూరులోని మారుతి నగర్‌కు చెందిన నాగ మురళిగా గుర్తించారు.
మంగళగిరి ఎన్నారై కొవిడ్ ఆస్పత్రిలో కోరోనా బాధితుడు ఆత్మహత్యయత్నం