గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొసాగుతోంది. తాడికొండ నియోజకవర్గం మెడికొండ్రు మండలం పోట్లపాడుకు చెందిన అంగన్వాడి కార్యకర్త కరోనా వైరస్ బారినపడింది. కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతుంది. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రైవేటు ఆసుపత్రి వెళ్లింది. ముందుగా కొవిడ్-19 పరీక్షలు చేశారు. కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మెడికొండ్రు మండలంలో ఇప్పటికి మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయి. మందపాడకు చెందిన ఒకే కుటుంబంలో ముగురికి కరోనా వచ్చింది. అదే కుటుంబానికి చెందిన వ్యక్తి కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు.
మెడికొండ్రు మండలంలో అంగన్వాడి కార్యకర్తకు కరోనా - తాడికొండ నియోజకవర్గం
గుంటూరు జిల్లా మెడికొండ్రు మండలంలో అంగన్వాడి కార్యకర్తకు కరోనా పాజిటివ్ వచ్చింది. మండలంలో ఇప్పటికి మొత్తం 13 కేసులు నమోదు అయ్యాయి.
అంగన్వావాడి కార్యకర్తకు కరోనా