కొవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసులు కరోనా బారిన పడటం బాధాకరమని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. గుంటూరు పోలీస్ కల్యాణ మండపంలో వంద మందికి కొవిడ్ 19 పరీక్షలు చేశారు. కరోనా బారిన పడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నటున్నామని అయన తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు గుంటూరు పోలీస్ కల్యాణ మండపంలో కరోనా పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు.
పోలీసు సిబ్బందికి కరోనా పరీక్షలు
గుంటూరు కంటైన్మెంట్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా బారిన పడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
పోలీసు సిబ్బందికి కరోనా పరీక్షలు