ఆసుపత్రులకు వెళ్లలేక..
అన్ని రంగాలను కుదిపేసిన కరోనా... నేత్ర సంబంధిత ఆస్పత్రులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కొవిడ్ భయంతో కంటి ఆస్పత్రులకు సైతం రోగులు రావడం లేదు. నేత్ర సమస్యల్లో జాప్యం చేస్తే మరింత ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కళ్లు కనపడక ..
ప్రపంచాన్ని అతలాకులతం చేసిన కరోనాతో వైద్యరంగం సైతం కుదేలైంది. లాక్ డౌన్ ప్రభావంతో అత్యవసర వైద్యసేవలు మినహా అన్నిరకాల వైద్యసేవల ఓపీని నిలిపేశారు. నేత్ర సంబంధిత సమస్యలదీ అదే పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటి వైద్య సేవలు ఇప్పటికీ అందకపోగా... ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిమితంగా చికిత్సలు జరుగుతున్నాయి. గుంటూరు పెదకాకానిలోని శంకర్ కంటి ఆస్పత్రితోపాటు పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇప్పటికీ ఓపీ సేవలు 50 శాతానికి చేరుకోలేదు. కరోనా భయంతోనే ప్రజలు కంటి ఆస్పత్రులకు రావడం లేదని వైద్యులు చెబుతున్నారు.