గుంటూరు జిల్లాలో తాజాగా 467 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 30,859కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 24, 059 మంది ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలో ఇవాళ కొత్తగా 9మరణాలు సంభవించాయి. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 340కి చేరుకుంది.
గుంటూరు జిల్లాలో కొవిడ్ విజృంభణ... కొత్తగా 467 పాజిటివ్ కేసులు - గుంటూరు కరోనా కేసుల వార్తలు
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 467 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 9 మంది మృతి చెందారు.
రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు గుంటూరు జిల్లాలోనే నమోదైన పరిస్థితి. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 116 ఉన్నాయి. ఇక జిల్లాలోని 467 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో బాపట్ల-36, చెరుకుపల్లి-26, చిలకలూరిపేట-18, మంగళగిరి-20, నాదెండ్ల-29, నరసరావుపేట-50,నకరికల్లు-10, పిడుగురాళ్ల-14, రొంపిచర్ల-16, సత్తెనపల్లి-20, తాడేపల్లి-17, వినుకొండ-24 చొప్పున కేసులు వచ్చాయని బులిటెన్ విడుదల చేశారు.
ఇవీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 8,601 కరోనా కేసులు