ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా కరోనా పంజా...తాజాగా 31 కేసులు నమోదు ! - గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. జిల్లాలో గురువారం ఏకంగా 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 762కు చేరుకుంది.

జిల్లా కరోనా పంజా...తాజాగా 31 కేసులు నమోదు !
జిల్లా కరోనా పంజా...తాజాగా 31 కేసులు నమోదు !

By

Published : Jun 18, 2020, 10:18 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గురవారం కొత్తగా 31 పాజిటివ్ కేసలు నమోదయ్యాయి. తాడేపల్లిలో 8 కేసులు, గుంటూరు 7, తెనాలిలో 5, బాపట్ల3, వినుకొండ 2, మంగళగిరి 2, దుగ్గిరాల 2, రొంపిచెర్ల మండలం కొత్తపల్లి 1, ప్రత్తిపాడు మండలం తిక్కారెడ్డి పాలెంలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. గతంలో గ్రీన్ జోన్లుగా ఉన్న వినుకొండలోనూ 2 కేసులు వచ్చాయి. అక్కడ కూడా కొత్త కేసు నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది.

పత్తిపాడు మండలం తిక్కారెడ్డిపాలెంలో ఓ పోస్ట్​మెన్​కు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 3రోజుల నుంచి అతను విధుల్లోనే ఉండటం, ఉత్తరాలు బడ్వాటా చేయటంతో ఎవరిరెవరికి వ్యాప్తి చెందిందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ఇంటింటి సర్వే చేపట్టారు. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details