ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంత్యక్రియల అనంతరం యువతికి కరోనా...ఆందోళనలో బంధువులు ! - అంత్యక్రియల అనంతరం యువతికి కరోనా

అంత్యక్రియల అనంతరం యువతికి కరోనా నిర్ధరణ కావటంతో అంతిమకార్యక్రమాల్లో పాల్గొన్న బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాదల గ్రామంలో జరిగింది. అప్రమత్తమైన అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తున్నారు.

అంత్యక్రియల అనంతరం యువతికి కరోనా...ఆందోళనలో బంధువులు !
అంత్యక్రియల అనంతరం యువతికి కరోనా...ఆందోళనలో బంధువులు !

By

Published : Jun 13, 2020, 11:20 PM IST

గుంటూరు జిల్లాలో మరణించిన యువతికి అంత్యక్రియల అనంతరం కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావటం కలకలం రేపింది. ముప్పాళ్ళ మండలం మాదల గ్రామానికి చెందిన యువతి కడుపు నొప్పితో 5 రోజుల క్రితం గుంటూరు జీజీహెచ్​లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించింది. అధికారులు ముందు జాగ్రత్తగా మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కానీ నివేదిక రాకుండానే మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. యువతి మృతదేహానికి కుటుంబసభ్యులు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఫలితాల అనంతరం యువతికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో అధికారులు గ్రామానికి వచ్చి యువతి కుటుంబ సభ్యులను క్వారెంటైన్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నమూనాలు సేకరించి పరీక్షలకోసం ప్రయోగశాలకు పంపనున్నారు. దీంతో యువతి అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరూ ఆందోళన చెందుతున్నారు. నివేదిక రాకుండానే మృతదేహాన్ని అప్పగించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఈ తరహా వ్యవహారం ఇది మూడోది కావటం అధికారుల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోంది. గతంలో నాదెండ్ల మండలం చందవరంలో, సత్తెనపల్లి పట్టణంలో సైతం మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించి.. నివేదిక రాకుండానే బంధువులకు అప్పగించారు. కరోనా వచ్చినట్లు తేలిన తర్వాత బంధువులకు పరీక్షలు చేశారు. ఇలా ఇప్పటికే డజనుకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details