ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో రెండో రోజు కొసాగుతున్న టీకా పంపిణీ - గుంటూరు జిల్లాలో రెండో రోజు కొసాగుతున్న టీకా పంపిణీ

కరోనా టీకా పంపిణీ కార్యక్రమం రెండో రోజు గుంటూరు జిల్లాలో మందకొడిగా సాగుతోంది. సాంకేతిక సమస్యలతో ఓటీపీ రాకపోవడం, తదితర కారణాల వల్ల టీకా కోసం వచ్చేవాళ్లు నిర్దేశిత సమయానికి టీకా కేంద్రానికి రాలేదని వైద్యులు తెలిపారు.

vaccination at guntur
గుంటూరు జిల్లాలో రెండో రోజు కొసాగుతున్న టీకా పంపిణీ

By

Published : Jan 17, 2021, 4:14 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం రెండో రోజు మందకొడిగా సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 31 కేంద్రాల్లో టీకా పంపిణీ చేస్తున్నారు. మొదటిరోజు 2వేల 274 మందికి వ్యాక్సిన్ అందజేశారు. 'టీకా తీసుకునే వైద్య సిబ్బందిని ముందుగానే ఎంపిక చేసినప్పటికీ నిర్దేశిత సమయానికి రాలేదు. మరికొంత మంది సాంకేతిక సమస్యల కారణంగా ఓటీపీ రాకా రాలేదు. దీంతో వారందరికీ ఫోన్లు చేసి టీకా కేంద్రానికి పిలవాల్సి వస్తోందని' వైద్యులు తెలిపారు. కొవిన్ పోర్టల్​లో సమాచారం కూడా సరిగా అప్‌డేట్ కావడం లేదు. దీంతో రికార్డుల్లో టీకా తీసుకున్న వారి వివరాలు నమోదు చేసుకుని పంపిస్తున్నారు.

టీకా తీసుకున్న వాళ్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని గుంటూరు జీజీహెచ్ టీకా కేంద్రం అధికారి డాక్టర్ నళిని సూచిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే చికిత్స అందించేందుకు వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details