గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ముందు వెళ్తున్న కారును వెనుకనుంచి కంటైనర్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో... గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వారు మరణించారు. పోలీసులు మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
కారును ఢీకొట్టిన కంటైనర్... నలుగురు మృతి - timmapuram national highway 16 latest accident news
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు రేవు వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నుజ్జు నుజ్జయిన కారు