ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావ-మరుదుల మధ్య గొడవ.. ఇరువర్గాల ఘర్షణగా మారింది! - గుంటూరులో బావ బావమరిది గొడవ వార్తలు

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అంచులవారిపాలెంలో బావబావమరుదుల మధ్య మెుదలైన గొడవ ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది. పశువుల కొట్టం విషయంలో వచ్చిన వివాదం.. కర్రలు, రాళ్లతో కొట్టుకునేదాకా వెళ్లింది.

బావబావమరిది గొడవ కాస్త.. ఇరువర్గాల ఘర్షణగా మారింది
బావబావమరిది గొడవ కాస్త.. ఇరువర్గాల ఘబావబావమరిది గొడవ కాస్త.. ఇరువర్గాల ఘర్షణగా మారిందిర్షణగా మారింది

By

Published : Jun 3, 2021, 9:38 AM IST

బావబావమరిది గొడవ కాస్త.. ఇరువర్గాల ఘర్షణగా మారింది

గుంటూరు జిల్లా అంచులవారిపాలెంలో 4 సెంట్ల స్థలంలోని పశువుల కొట్టం విషయంలో బావ, బావమరుదులు అయిన గలబ బసవయ్య, వేపూరి శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్త చినికి చినికి గాలివానై ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గ్రామంలోని అనేక మంది పరస్పరం రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ కారణంగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

ఘర్షణలో ఇరువర్గాలలోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని గ్రామస్థులు సత్తెనపల్లిలోని వైద్యశాలకు తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్​ తరలించారని బంధువులు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వివాదంపై విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details