కోల్డ్ స్టోరేజీ యాజమాన్య నిర్లక్షమే కారణం! - ఆళ్ల రామకృష్ణ రెడ్డి
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో నిన్న జరిగిన జీవీఆర్ కోల్డ్ స్టోరేజ్ ప్రమాద స్థలాన్ని.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.
cold_storage_visit_mangalagiri_mla_rk
కోల్డ్ స్టోరేజ్ భవనం కుప్పకూలిన ఘటనలో పెను ప్రమాదం తప్పిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చెప్పారు. పసుపుకు రేటు లేకపోవడంతో రైతులు ఎక్కువగా పసుపు నిల్వలు పెట్టారన్నారు. కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని.. తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పసుపు పంటకు మంచి ధర కల్పించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.