''ఏ శాఖకు.. ఎన్ని నిధులు కేటాయిద్దాం?'' - jagan
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖపై రెండో రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
cm jagan
ఆర్థిక శాఖపై రాజధాని అమరావతిలో రెండో రోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై చర్చిస్తున్నారు. నవరత్నాల హామీల అమలుకు ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి.. ఆ దిశగా నిధుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశముంది.