మంత్రివర్గం భేటీ - undefined
సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. దిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపిన నేతలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన వృద్ధుల పింఛను అర్హత వయసు తగ్గింపు, అన్నదాత సుఖీభవ పథకం, గ్రీన్ కారిడార్, 60సంవత్సరాలు దాటిన ప్రతీ జర్నలిస్టుకు పింఛను ఇచ్చే అంశాలు చర్చకు రానున్నాయి. ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికల నియమావళి దృష్ట్యా పలు కీలక బిల్లులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
TAGGED:
cm meeting