రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలను మూడేళ్లలో పాఠశాలల తరహాలో ఆధునీకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. మహిళలకు పౌష్టికాహారం అందించడం సహా శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మహిళా శిశుసంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్షించారు. అంగన్వాడీల నుంచి స్కూళ్లలో చేరని దాదాపు ఏడువేల మంది బాలలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బడిబాట పట్టేలా చేయాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలపై ప్రత్యేక యాప్ తయారుచేయాలని సీఎం సూచించారు. దీనికి ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకుందామన్న సీఎం... ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామన్నారు. దీనికోసం పోర్టల్ రూపకల్పనకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. మహిళా, శిశు సంక్షేమంలో గ్రామవాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలని సీఎం ఆదేశించారు. శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మద్యానికి బానిసలైన వారి కోసం కౌన్సెలింగ్ సెంటర్ల ఏర్పాటు అంశంపై దృష్టి పెట్టాలన్నారు. దివ్యాంగుల విషయంలో ఉదారంగా ఉండాలని...ఎలాంటి పరికరాలు కావాలన్నా అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళల కోసం వన్‌స్టాప్ సెంటర్లు