CM JAGAN RELEASED INPUT SUBSIDY : 62 శాతం జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడ్డారని సీఎం జగన్ తెలిపారు. రైతును అన్నివిధాలా ఆదుకుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని వ్యాఖ్యానించారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలను సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. మూడేళ్ల 5 నెలల కాలంలో రైతులను అన్నివిధాలా ఆదుకున్నామన్నారు. ఏ సీజన్‌లో పంటనష్టం జరిగితే.. అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నామని తెలిపారు.
మొత్తం రూ.200 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్న సీఎం.. 21.31 లక్షలమందికి రూ.1,834 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. 8,22,411 మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము చెల్లిస్తున్నామన్నారు. ఏడాదిలోపు చెల్లించిన రైతులకు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా ద్వారా మూడేళ్లలో రూ.25,971 కోట్లు.. బీమా సొమ్ము రూపంలో రూ.6,685 కోట్లు రైతులకు చెల్లించామని పేర్కొన్నారు.