గోదావరి జిల్లాల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పు - సీఎం జగన్ను కలిసిన ఎమ్మెల్యేలు - సీఎం జగన్ను కలిసిన గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 4:38 PM IST
|Updated : Dec 18, 2023, 5:05 PM IST
16:28 December 18
గోదావరి జిల్లాల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పుపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి చర్చించారు.
CM Jagan Meeting with Godavari Districts YSRCP MLAs: శాసన సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ ఇన్‌ఛార్జులను సీఎం జగన్ మార్చారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాలోని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మార్చేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరికి సముచిత స్థానం లభిస్తుంది, మైరుగైన వారు ఎవరు, ప్రజాభిమానం ఉన్న నాయకులెవరు వంటి అంశాల దృష్ట్యా, గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో చర్చించారు.
గోదావరి జిల్లాల్లో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పుపై, ఆ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పు అంశంలో సీఎంను కలిసిన వారిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఉన్నారు.
అంతేకాకుండా పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, మార్పులపై సీఎం జగన్ వీరితో చర్చించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పులపై సీఎం జగన్ ప్రధానంగా చర్చించారు.