Oxygen Plants In Guntur GGH:కరోనా థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో తలెత్తిన ఆక్సిజన్ కొరత మళ్లీ రాకుండా జీజీహెచ్ రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
ఒక్కొక్కటి 1000 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లను ముఖ్యమంత్రి జగన్ రేపు వర్చువల్గా ప్రారంభించనున్నారు. కరోనా మెుదటి వేవ్ సమయంలో ఆక్సిజన్ సరఫరాకు ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. మళ్లీ అటువంటి పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి చెప్పారు.