న్యాయవాదిపై ఓ వ్యక్తి దాడి చేసి గాయపర్చిన ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో చోటుచేసుకుంది. మాచర్లకు చెందిన న్యాయవాది యాండపల్లి కృష్ణమూర్తిపై కంభంపాడు గ్రామానికి చెందిన వి.పాపారావు అనే వ్యక్తి చిన్నపాటి గొడ్డలితో దాడి చేశాడు. 2014 నుంచి పాపారావుకి సంబంధించిన కేసులు వాదిస్తున్నట్లు బాధితుడు కృష్ణమూర్తి తెలిపారు. ఒక సివిల్ కేసులో కోర్టులో అనుకూలంగా తీర్పు రాలేదనే కారణంతో తనపై కక్ష పెంచుకున్నాడని.. కోర్టు నుంచి బయటకు వచ్చాక గొడ్డలితో దాడి చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని.. మాచర్ల పట్టణ ఎస్సై మోహన్ వెల్లడించారు.
తీర్పు అనుకూలంగా రాలేదని.. న్యాయవాదిపై దాడి - గుంటూరు క్రైమ్ న్యూస్
తనకు తీర్పు అనుకూలంగా రాలేదని న్యాయవాదిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్లలో చోటుచేసుకుంది.
తీర్పు అనుకూలంగా రాలేదని.. న్యాయవాదిపై దాడి