ఈ నెల 9న ముఖ్యమంత్రి జగన్‌తో సినీ ప్రముఖుల సమావేశం కానున్నారు. చిరంజీవి నేతృత్వంలో దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు సీఎంను కలవనున్నారు. సీఎం జగన్‌తో సమావేశానికి బాలకృష్ణను ఆహ్వానించామని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. అయితే పుట్టినరోజు వేడుకల వల్ల హాజరుకాలేనని బాలకృష్ణ తెలిపారని కల్యాణ్ వెల్లడించారు. సినీ పరిశ్రమ సమస్యలు, చిత్రీకరణ అనుమతులపై సీఎం జగన్‌తో చర్చిస్తామని ఆయన తెలిపారు.
9న సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల సమావేశం - సినీ ప్రముఖులతో జగన్ సమావేశం
ముఖ్యమంత్రి జగన్‌తో సీని పెద్దలు ఈ నెల 9న భేటీ కానున్నారు. సినీ పరిశ్రమ సమస్యలు, చిత్రీకరణ అనుమతులపై ఇందులో చర్చిస్తామని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. అయితే ఈ భేటీకి సినీ హీరో బాలకృష్ణ హాజరు కావటం లేదు.
Cine celebrities are scheduled to meet chief minister Jagan on the 9th of this month