ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలుని ప్రాణం తీసిన మాంజా - బాలుడి ప్రాణం తీసిన మాంజా

గాలిపటానికి కట్టిన దారం ఓ చిన్నారి పాలిట యమపాశమయ్యింది. తండ్రితో కలిసి బయటకు వెళ్తున్న సమయంలో గాలిపటం దారం మెడకు చుట్టుకుని చిన్నారి చనిపోయిన ఘటన గుంటూరులో జరిగింది. తమ కుమారుడు ఇక లేడన్న విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

బాలుని ప్రాణం తీసిన మాంజా
బాలుని ప్రాణం తీసిన మాంజా

By

Published : Jan 6, 2020, 5:05 PM IST

Updated : Jan 6, 2020, 7:43 PM IST

బాలుని ప్రాణం తీసిన మాంజా

గాలిపటానికి కట్టిన దారం ఓ చిన్నారి జీవితాన్ని చిదిమేసిన విషాద ఘటన గుంటూరులో జరిగింది. నగరంలోని సంగడికుంటకి చెందిన కౌషిక్ అనే మూడేళ్ల చిన్నారి తన తండ్రితో బైక్ పై వెళ్తున్న సమయంలో... గాలిపటం దారం మెడకు చుట్టుకుంది. ఈ ప్రమాదంలో కౌషిక్ మెడకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన బాలుడిని జీజీహెచ్​కు తరలించారు. తీవ్ర రక్తస్రావం కావటంతో కాసేపటికే బాలుడు మృతి చెందాడు. కౌషిక్ మరణ వార్త విని తల్లి గుండెలవిసేలా రోదించింది. తమ బిడ్డ ఇక లేడన్న విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Last Updated : Jan 6, 2020, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details