ఓ కొత్త ఎమ్మెల్యే కారు.. ఓ యువకుణ్ని ఢీ కొట్టింది. అసెంబ్లీకి వెళ్లే హడావుడిలో వేగంగా వెళుతున్న మహిళా ఎమ్మెల్యే వాహనం.. మంగళగిరి మండలం నిడమర్రు వద్ద ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది. అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి మాత్రం పట్టించుకోకుండా తన దారిన తాను ఆటోలో అసెంబ్లీకి వెళ్లిపోయారు. ప్రమాదం జరిగితే ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయిన చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని తీరుపై గ్రామస్థులు మండిపడ్డారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ఉండాల్సింది పోయి.. కనీసం మానవత్వం లేకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరుతో విస్తుపోయిన జనం.. ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. .
కారుతో ఢీ కొట్టి.. ఆటోలో వెళ్లిపోయిన... ఆ ఎమ్మెల్యే.. ! - accident
తన వాహనం ఓ వ్యక్తిని ఢీ కొట్టినా పట్టించుకోలేదు. ఓ వ్యక్తికి గాయమైనా చలించలేదు. కనీసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నమూ చేయలేదు. ఏదీ జరగనట్టుగా.. ఎంచక్కా ఆటోలో అసెంబ్లీకి వెళ్లిపోయారు.. ఆ మహిళా ఎమ్మెల్యే.
యువకుడ్ని ఢీ కొట్టి... అసెంబ్లీకి చిలకలూరి పేట ఎమ్మెల్యే
Last Updated : Jun 14, 2019, 7:11 AM IST