Video conference with State CSs PK Mishra, Rajiv Gauba: జనవరి మొదటి వారంలో జరగనున్న.. 2వ జాతీయ స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి సంబంధించిన వివిధ అంశాలపై.. వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 5 నుంచి 7 వరకు జాతీయ స్థాయిలో సిఎస్ ల సమావేశానికి సంబంధించి సన్నాహక ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించిన వేస్ట్ వాటర్ రీసైక్లింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, వేస్ట్ టు ఎనర్జీ అంశాలపై ప్రభుత్వ కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు.
రాష్ట్రాల సీఎస్‌లతో రాజీవ్ గౌబ, పీకే మిశ్రా వీడియో కాన్ఫరెన్స్..
Video conference with State CSs PK Mishra, Rajiv Gauba: వచ్చే నెలలో జరగనున్న.. జాతీయ స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశానికి.. సర్వం సిద్దం చేసేందుకు.. వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో పీఎం ముఖ్యకార్యదర్శి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, పీకే.మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం
వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన బెస్ట్ ప్రాక్టీసులను.. సమావేశంలో జాతీయ స్థాయిలో షేర్ చేసేందుకు వీలుగా సన్నద్ధమై రావాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఇన్నోవేటివ్ విధానాలను జాతీయ స్థాయిలో అడాప్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నందున.. వాటిపై సమావేశంలో చర్చించనున్నట్లు సిఎస్ లకు వివరించారు. సర్కులర్ ఎకానమీ విషయంలో వివిధ రాష్ట్రాలు చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఇవీ చదవండి: