ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పసుపు మార్కెట్​లో అపోలో వైద్య శిబిరం - health check up

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో అపోలో హాస్పటల్​ వారి సహకారంతో పసుపు మార్కెట్​ యార్డులో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు రక్త పరీక్షలు, బీపీ తదితర పరీక్షలు చేస్తున్నారని మార్కెట్​ సెక్రటరీ బ్రహ్మయ్య తెలిపారు.

పసుపు మార్కెట్​లో అపోలో వైద్య శిబిరం

By

Published : May 16, 2019, 3:08 PM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్​ యార్డులో అపోలో హాస్పటల్​ వారి సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మార్కెట్​ సెక్రటరీ బ్రహ్మయ్య వైద్య శిబిరం పెట్టడానికి కృషి చేశారు. బీపీ, మధుమేహం, కొలస్ట్రాల్​ పరీక్షలు చేస్తున్నారని... చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్యశిబిరాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. పెద్ద సమస్యలు తలెత్తితే వీడియో కాన్ఫరెన్స్​తో నేరుగా అపోలో వైద్యులతో మాట్లాడటానికి అవకాశం కల్పించామన్నారు. అలాగే వారి రిపోర్టులను నేరుగా సెల్​ఫోన్లకు అందించే వెసులుబాటు కల్పించామని వివరించారు.

పసుపు మార్కెట్​లో అపోలో వైద్య శిబిరం

ABOUT THE AUTHOR

...view details