Chandrababu Naidu writes letter to DGP: కుప్పం ఘటనపై పోలీసులు, వైసీపీ నేతలు అనుసరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. ప్రజలకు ఆటంకం లేకుండా గ్రామాల్లో సభలు నిర్వహిస్తామని లేఖలో చంద్రబాబు తెలిపారు. కుప్పంలో తన పర్యటనపై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు తన పర్యటనకు పలుమార్లు ఆటంకం కలిగించినట్లు వెల్లడించారు. పర్యటనలో తమ వాహనాలను పోలీస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా స్వాధీనం చేసుకున్నారని చంద్రబాబు వెల్లడించారు. పర్యటన అనుమతులు కోరినా వాహనాలు స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు.
పలమనేరు డీఎస్పీపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ - కుప్పంలో పోలీసుల తీరుపై బాబు
Chandrababu Naidu: కుప్పం ఘటనలో పోలీసుల తీరుపై చంద్రబాబు డీజీపీ లేఖ రాశారు. తన పర్యటనలో పోలీసులు అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అటంకాలు లేకుండా పర్యటనకు అనుమతులు ఇవాలని లేఖలో పేర్కొన్నారు. కుప్పంలో తన పర్యటనపై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు తన పర్యటనకు పలుమార్లు ఆటంకం కలిగించినట్లు లేఖలో వెల్లడించారు.
శాంతిపురం మండలం పెద్దూరుకు వచ్చి తన పర్యటన అడ్డుకున్నారని డీజీపీకి లేఖలో వివరించారు. పర్యటన అడ్డుకుని ఎమ్మెల్యేగా తనకున్న ప్రాథమిక హక్కులను పోలీసులు కాలరాశారని ఆరోపించారు. తన పర్యటనకు భద్రత కల్పించడంలో ఎస్పీ విఫలమయ్యారని చంద్రబాబు తెలిపారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిపై లాఠీఛార్జ్ చేశారనీ.. అనంతరం వారిపైనే తిరిగి క్రిమినల్ కేసులు పెట్టినట్లు లేఖలో వెల్లడించారు. గుర్తింపు కార్డులు లేకుండా పోలీసులు నా పర్యటనలో తిరుగుతున్నారని ఆరోపించారు. తక్షణమే పలమనేరు డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యటన పూర్తిచేసేలా అనుమతులు ఇవ్వాలని చంద్రబాబు డీజీపీని కోరారు.
ఇవీ చదవండి: